Share News

రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:05 PM

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగం గుంట్లలో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు.

రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
AP CM Chandrababu Naidu

అమరావతి, జూన్ 19: రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. శనివారం (జూన్ 20వ తేదీ) పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగం గుంట్లలో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి విడత నగదును అన్నదాతల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ ద్వారా ఈ ఏడాది తొలి విడతగా రూ.3,125 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఈ నగదు ద్వారా 46.85 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.


మరో వైపు శనివారం ( జూన్ 20వ తేదీ) ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద నిధులను విడుదల చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌ హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు చొప్పున నగదు జమ కానుంది. దీంతో కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఒకే రోజు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నాయి.


ఇంకో వైపు జూన్ 30వ తేదీన రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిరలో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు.


ఇవి కూడా చదవండి..

యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 235వ ఎస్ఎల్‌బీసీ సమావేశం..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 04:37 PM