Share News

చంద్రబాబుకు 'భారత్ రైజింగ్...' పుస్తకం అందజేత.. అభినందించిన సీఎం

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:30 PM

డాక్టర్ దిలీప్ కిలారు తాను రచించిన పుస్తకాన్ని తాజాగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహూకరించారు. ఈ సందర్భంగా పుస్తకంలోని అంశాలను పరిశీలించిన సీఎం.. రచయిత కృషిని అభినందించారు.

చంద్రబాబుకు 'భారత్ రైజింగ్...' పుస్తకం అందజేత.. అభినందించిన సీఎం
Dileep Kilaru presents book to the CM Chandrababu

ఇంటర్నెట్ డెస్క్: డాక్టర్ దిలీప్ కిలారు తాను రచించిన ‘భారత్ రైజింగ్ ఇన్ ది మోదీ ఎరా’ పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహూకరించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో ముఖ్యమంత్రిని కలిసి పుస్తక ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా పుస్తకంలోని అంశాలను పరిశీలించిన సీఎం.. వినూత్నమైన అంశంపై రూపొందించిన ఈ గ్రంథం ఎంతో విలువైందని పేర్కొంటూ రచయిత కృషిని అభినందించారు. పుస్తక రచనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులోనూ ఇలాంటి సృజనాత్మక రచనలు చేయాలని కాంక్షించారు.


కాగా.. ఈ పుస్తకాన్ని గత శనివారం(జూన్ 20న) కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. 110 కేంద్ర పథకాలతో ఉండే ఓ మంచి బుక్‌ను దిలీప్ రచించారని సత్యకుమార్ ప్రశంసించారు. జీవన ప్రమాణాలు పెంపొందిచాలని, కేంద్ర పథకాలపై పేదలకు అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో దీనిని రచించారని కొనియాడారు. గత 12 ఏళ్లలో వచ్చిన క్వాలిటీ, క్వాంటిటేటివ్ అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రజల్లోకి తీసుకెళ్లే మంచి ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు సత్యకుమార్. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై రచయితను అభినందించారు. తాజాగా ముఖ్యమంత్రికి పుస్తకాన్ని అందజేయడంతో దానికి మరింత గుర్తింపు లభించినట్లైంది. రచయిత కృషిని సాహితీ, సామాజిక వర్గాల ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

Dileep Kilaru


ఇవీ చదవండి:

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

ఒప్పందం ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డొనాల్డ్ ట్రంప్

Updated Date - Jun 23 , 2026 | 01:32 PM