రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Mar 20 , 2026 | 09:43 PM
ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు.
అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు.
రంజాన్ మీ జీవితంలో ఆనందం నింపాలి: సీఎం చంద్రబాబు..
ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశమని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ ఈద్ ముబారక్ అని సీఎం చంద్రబాబు ట్వీట్ పెట్టారు.
పవన్ కల్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించారని అన్నారు. ముస్లిం సోదరులు శనివారం ఈద్-ఉల్-ఫితర్ వేడుక చేసుకోనున్నారని పేర్కొన్నారు. ఆ ధర్మాన్ని పాటిస్తున్న వారందరికీ పవన్ కల్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.