Share News

పలు జిల్లాలకు అధ్యక్షులను నియమించిన ఏపీ బీజేపీ చీఫ్

ABN , Publish Date - May 15 , 2026 | 11:07 AM

తెలుగు రాష్ట్రాల్లో మరింత బలపడే దిశగా భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను రాష్ట్ర బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ శుక్రవారం నియమించారు.

పలు జిల్లాలకు అధ్యక్షులను నియమించిన ఏపీ బీజేపీ చీఫ్
AP BJP Chief PVN Madhav

అమరావతి, మే 15: తెలుగు రాష్ట్రాల్లో మరింత బలపడే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను రాష్ట్ర బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ నియమించారు. శుక్రవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నియామకాలు జరిగాయని స్పష్టం చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.


జిల్లాలు.. బీజేపీ అధ్యక్షులు..

  • పోలవరం జిల్లా: బుల్లికొండలు దొర

  • మార్కాపురం జిల్లా: పోశం వెంకటకృష్ణారావు

  • బాపట్ల జిల్లా: మువ్వల వెంకట రమణారావు

  • అన్నమయ్య జిల్లా: పులిరెడ్డి నరేంద్ర కుమార్‌రెడ్డి


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి లోకేశ్

For More AP News And Telugu News

Updated Date - May 15 , 2026 | 11:22 AM