బాక్సర్ అంకుష్ పంఘల్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు..
ABN , Publish Date - Oct 02 , 2026 | 07:56 PM
ఆసియా క్రీడలు-2026లో పురుషుల 80 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత బాక్సర్ అంకుష్ అంకుష్ పంఘల్‌కు ఏపీ డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్సియాంగ్‌పై విజయం సాధించి స్వర్ణ పతకం దక్కించుకున్నారని ప్రశంసించారు.
అమరావతి: ఆసియా క్రీడలు-2026లో పురుషుల 80 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత బాక్సర్ అంకుష్ పంఘల్‌కు ఏపీ డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్సియాంగ్‌పై విజయం సాధించి స్వర్ణ పతకం దక్కించుకున్నారని ప్రశంసించారు. ధైర్యం, ప్రశాంతత, పట్టుదలతో ప్రతి సవాలును అధిగమించి అంకుష్ అగ్రస్థానానికి చేరుకున్నారని కొనియాడారు.
ఈ ఏడాది ప్రారంభంలో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన అంకుష్.. ఇప్పుడు ఆసియా క్రీడల్లోనూ ఛాంపియన్‌గా నిలవడం భారత బాక్సింగ్‌లో పెరుగుతున్న బలానికి నిదర్శనమని పవన్ పేర్కొన్నారు. ‘ఒక ఫైటర్.. ఒక స్వర్ణ క్షణం.. భారత్‌కు మరో గర్వకారణమైన అధ్యాయం’ అంటూ అంకుష్ పంఘల్‌ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా మోసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ అభినందన సందేశాన్ని పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
గాంధీజీ స్ఫూర్తితోనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం: సీఎం చంద్రబాబు
విశాఖ తీరంలో విషాదం.. అలల తాకిడికి ముగ్గురు విద్యార్థుల గల్లంతు