Share News

పొగాకు రైతులకు శుభవార్త.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయం

ABN , Publish Date - Jul 27 , 2026 | 09:54 PM

పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పొగాకు కొనుగోళ్లకు మద్దతు ఇచ్చేందుకు ఇరు ప్రభుత్వాలు అంగీకరించాయి. సోమవారం పొగాకు ధర స్థిరీకరణ, పొగాకు రైతులను ఆదుకునే అంశంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పొగాకు రైతులకు శుభవార్త.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయం
AP CM Chandrababu

అమరావతి, జులై 27: పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పొగాకు కొనుగోళ్లకు మద్దతు ఇచ్చేందుకు ఇరు ప్రభుత్వాలు అంగీకరించాయి. సోమవారం పొగాకు ధర స్థిరీకరణ, పొగాకు రైతులను ఆదుకునే అంశంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా రూ.188 కోట్లు భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.


ధరల లోటు భర్తీ కింద పొగాకు రైతులకు కిలో పొగాకు రూ.20 ఇవ్వాలని నిర్ణయించాయి. 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లకు మద్దతిచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. పొగాకు బ్రైట్ రకం కిలో రూ.240, మీడియం రకం పొగాకు రూ.190, లో గ్రేడ్ పొగాకు రూ.110కి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో రాష్ట్రప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం సంప్రదింపులు జరిపారు.


మరో వైపు రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శితోపాటు డైరెక్టర్ సమావేశమయ్యారు. సీఎం సూచనల మేరకు పొగాకు రైతులను ఆదుకునేందుకు సహకరించాలని కోరుతూ రాష్ట్రంలోని పొగాకు పంపిణీదారులతో కేంద్ర ప్రతినిధులు చర్చలు జరిపారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు వివిధ ప్రతిపాదనలపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ టెలీ కాన్ఫరెన్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల ఉన్నతాధికారులతో పాటు పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్యాంగ స్ఫూర్తితోనే విధులు నిర్వర్తిస్తున్నా: రంగనాథ్

హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్‌ సర్కార్‌..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2026 | 09:59 PM