Minister Lokesh: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Jan 16 , 2026 | 09:41 PM
ఏఎం గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో భారీ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా అవతరించనుందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
అమరావతి, జనవరి 16: ఏఎం గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో భారీ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా అవతరించనుందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కాకినాడలో గ్రీన్ అమోనియా సంస్థ 1.5 ఏమ్‌టీపీఏ (MTPA) సామర్థ్యంతో ఎగుమతి టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దాంతో 7.5 గిగావాట్ల రిన్యూవబుల్ ఎనర్జీతో విద్యుత్ సరఫరా చేయనున్నట్లు వివరించారు.
అలాగే 1 గిగావాట్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ వినియోగం చేయనుందన్నారు లోకేశ్. తద్వారా భారత్ నుంచి తొలిసారిగా విదేశాలు.. జర్మనీ, సింగపూర్, జపాన్‌లకు ఈ గ్రీన్ ఎనర్జీని ఎగుమతి చేస్తామని తెలిపారు. అందుకు 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెడుతున్నట్లు వివరించారు. దీని ద్వారా 8 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కీలక ప్రకటన చేస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ జెండాలతో ప్రభల తీర్థ మహోత్సవంలో నేతల వీరంగం
బీఆర్ఎస్ పాలకుల ఉద్యోగాలు పోతేనే మీకు ఉద్యోగాలు వచ్చాయి: సీఎం
For More AP News And Telugu News