Share News

ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:33 PM

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం మండలి ప్రారంభమైన తర్వాత.. తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యిపై లఘు చర్చ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వివరణ ఇచ్చారు.

ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా

అమరావతి, మార్చి 05: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం మండలి ప్రారంభమైన తర్వాత.. తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యిపై లఘు చర్చ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వివరణ ఇస్తుండగా.. ఆయన ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డు తగిలారు. బుధవారం శాసన మండలి చైర్మన్ మోజేస్ రాజు‌పై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు చైర్మన్ స్పందిస్తూ.. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.


మండలిలోనే ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను చైర్మన్ గురించి బుధవారం చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చానని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. అసలు తాను ఈ వ్యాఖ్యలు చేసింది వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి అని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. కానీ దీనిపై ఇప్పటి వరకు సమాధానం లేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.


ఈ వ్యాఖ్యలపై వెంటనే అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ క్రమంలో చైర్మన్ పోడియం చుట్టిముట్టారు. ఆ నిరసనల మధ్య మంత్రి ఆనం లడ్డూ అంశంపై వివరణ ఇస్తున్నారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యులు మరింత రెచ్చిపోయారు. మండలిని కొద్దిసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ మండలి ప్రారంభమైంది. అయినా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. అలాంటి వేళ.. మండలిని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ మోజేస్ రాజు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..

అంగన్‌వాడీ సమస్యలపై అసెంబ్లీలో చర్చ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 03:51 PM