Share News

ప్రైవేట్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చెల్లింపులు ప్రారంభం

ABN , Publish Date - Apr 27 , 2026 | 08:22 PM

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ( ఆరోగ్య శ్రీ) అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపును ప్రభుత్వం ప్రారంభించింది. ఒప్పందానికి అనుగుణంగా 25 ఆసుపత్రులకు రూ.62 కోట్లు చెల్లించింది.

ప్రైవేట్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చెల్లింపులు ప్రారంభం

అమరావతి, ఏప్రిల్27: ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ( ఆరోగ్య శ్రీ) అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపును ప్రభుత్వం ప్రారంభించింది. ఒప్పందానికి అనుగుణంగా 25 ఆసుపత్రులకు రూ.62 కోట్లు చెల్లించింది. అందుకు సంబంధించిన నివేదికను సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు అధికారులు అందజేశారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 323 ఆసుపత్రుల యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ విధానంలో రూ. వెయ్యి కోట్లు జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.


ఆరోగ్య శ్రీ సేవల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తమకు రూ.3 వేల కోట్ల బకాయి ఉందని ఈ ఏడాది మార్చిలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేశాయి. ఇవి చెల్లించకుంటే.. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సేవలు నిలిపివేస్తామని ప్రకటించాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను బంద్ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చాయి. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి.. ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు జరిపింది. 10 రోజుల్లో రూ. వెయ్యి కోట్ల చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏప్రిల్‌ నెలాఖరు నుంచి ఈ చెల్లింపులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఒక్కరూ అడ్డుకోలేదు: కేసీఆర్

కవిత కొత్త పొలిటికల్ పార్టీని ఎందుకు పెట్టారో చెప్పండి కేటీఆర్: ఎమ్మెల్యే సామేల్

For More AP News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 08:37 PM