Share News

Liquor Rates Hike: పండగ వేళ మందుబాబులకు షాక్..

ABN , Publish Date - Jan 12 , 2026 | 08:33 PM

కొత్త ఏడాది వచ్చి కొన్ని రోజులే అయింది. సంక్రాంతి పండగ కొన్ని గంటల్లో రానుంది. అలాంటి వేళ.. ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Liquor Rates Hike: పండగ వేళ మందుబాబులకు షాక్..

అమరావతి, జనవరి 12: కొత్త ఏడాది ప్రారంభమైన కొన్ని రోజులకే.. అది కూడా సంక్రాంతి పండగకు కొన్ని గంటల ముందు మందుబాబులకు ఏపీ ఎక్సైజ్ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. కొన్ని రకాల మద్యం బాటిల్స్‌పై రూ.10ల ధర పెంచింది. అన్ని సైజుల బాటిళ్లపై రూ.10 పెంచింది. అయితే కొన్ని బాటిళ్లను మాత్రం అందులో నుంచి మినహాయించింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99 (180 ఎం. ఎల్) ఇండియన్ మేడ్ ఫారన్ లిక్కర్ (IMFL), బీర్, వైన్, ఆర్‌టీడీలకు ఈ పెంపు వర్తించదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


అలాగే బార్లపై విధిస్తున్న అదనపు ఏఆర్‌ఈటీ (ARET) తొలగింపును అంగీకరిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బార్లు- షాపుల మధ్య ధరల సమానత్వమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రిటైలర్ మార్జిన్ సుమారు 1శాతం పెంచుతున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో వివరించింది. ఇక ఐఎంఎఫ్ఎల్, ఎఫ్‌ఎల్, బీర్, వైన్ షాప్‌లకు మార్జిన్‌ను పెంచింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం..

నారావారిపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 09:23 PM