ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 08 , 2026 | 08:42 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. జూన్ 10, 11 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు.
అమరావతి, జూన్08: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. జూన్ 10, 11 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. జూన్10వ తేదీ విజయవాడ నుంచి సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. భారత్ మండపంలో జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఆ రోజు రాత్రి న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబు బస చేయనున్నారు.
ఆ మరునాడు జూన్ 11వ తేదీన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరవుతారు. భారత్ మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం గురువారం (జూన్ 11వ తేదీ) సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు. రాత్రికి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పర్యాటక రంగం ద్వారా ఉపాధి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: మంత్రి జూపల్లి
పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మహిళా శక్తికి 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ
For More AP News And Telugu News