Share News

గుంటూరులో అంబటి రాంబాబు వీరంగం.. పోలీసులతో దురుసు ప్రవర్తన

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:44 PM

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓవరాక్షన్ చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఆంద్రజ్యోతి కార్యాలయంవైపుకు దూసుకెళ్లేందుకు యత్నించిన అంబటిని పోలీసులు అడ్డుకున్నారు.

గుంటూరులో అంబటి రాంబాబు వీరంగం.. పోలీసులతో దురుసు ప్రవర్తన
Ambati Rambabu

గుంటూరు, ఏప్రిల్ 8: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) సోదరులు గుంటూరులో మరోసారి హంగామా సృష్టించారు. జిల్లాలోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలకు వైసీపీ పిలుపునిచ్చింది. వైసీపీ నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని సూచించారు. ఇందుకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి కార్యాలయంవైపుకు దూసుకెళ్లేందుకు అంబటి రాంబాబు, అతడి సోదరుడు అంబటి మురళి యత్నించారు. వైసీపీ కార్యకర్తలతో కలిసి బారికేడ్లను తోసుకుంటూ వెళ్లారు.


అడ్డుకోబోయిన పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. వారితో దురుసుగా ప్రవర్తించారు. తాము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామంటూ పోలీసులకు వార్నింగ్ ఇస్తూ అంబటి సోదరులు వీరంగం సృష్టించారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద అంబటి రాంబాబు, వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.


గతంలో కూడా అంబటి రాంబాబు పలు చోట్ల బారికేడ్లను తోసివేయడం, అడ్డుకున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించి వారిని హెచ్చరించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంలో సత్తెనపల్లి వద్ద పోలీసులు ఏర్పాటు చేసి బారికేడ్లను తోసివేసి అంబటి రాంబాబు హల్‌చల్ చేశారు. ఈరోజు కూడా గుంటూరు ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద పోలీసులతో అంబటి రాంబాబు ప్రవర్తించిన తీరు తీవ్ర రచ్చకు దారితీసింది.


ఇవి కూడా చదవండి...

మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ.. సిబ్బందిపై ఆగ్రహం

అమరావతి పనులపై సమీక్ష.. మంత్రి నారాయణ ఆదేశాలివే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 08 , 2026 | 12:50 PM