అమరావతిలో ఎంట్రీకి అందుబాటులోకి రానున్న మరిన్ని రహదారులు.. మంత్రి సమీక్ష
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:02 PM
రాజధాని అమరావతిలో ఎంట్రీకి మరిన్ని రహదారులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో ఇతర రహదారుల కనెక్టివిటీపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించారు.
అమరావతి, ఆగస్టు20: రాజధాని అమరావతిలో ఎంట్రీకి మరిన్ని రహదారులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో ఇతర రహదారుల కనెక్టివిటీపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించారు. గురువారం E 13, E 15, E 1, E 3 రహదారి నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
మంగళగిరి నుంచి అమరావతికిలోకి ప్రవేశించే E 15 రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రికి అధికారులు వివరించారు.16వ నెంబర్ జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్ ద్వారా అమరావతిలోకి E 13 రోడ్డు ప్రవేశించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు (E 3) మూడో ఫేజ్‌లో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ (స్టీల్ బ్రిడ్జి - మణిపాల్ హాస్పిటల్) పనులు కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులకు మంత్రి నారాయణ సూచించారు.
సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా కరకట్టను వెడల్పు చేస్తూ ప్రకాశం బ్యారేజీ వరకూ E 1 రోడ్డును నిర్మిస్తున్నారు. ఆయా రోడ్ల నిర్మాణాలకు అవసరమైన రైల్వే ఇతర అనుమతులు దాదాపు కొలిక్కి వచ్చాయని మంత్రి నారాయణ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. రోడ్ల పనులకు ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ కార్తీక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మతోపాటు వివిధ శాఖల ఇంజినీర్లు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్
కుమార్తె వ్యాఖ్యలు.. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన మంత్రి కొండా సురేఖ
For More AP News And Telugu News