Share News

ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యాలయంలో నలుగురి ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - May 01 , 2026 | 06:05 PM

రాజధాని అమరావతిలోని ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగస్థులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది.

ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యాలయంలో నలుగురి ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
Commissioner Veerapandian

అమరావతి,మే 01: రాజధాని అమరావతిలోని ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగస్థులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండ్యన్ ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరిలోని ఆహార భద్రత శాఖ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్ డి. శిరీష, సీనియర్ అసిస్టెంట్స్ జి. అఖిల్, సంగీత రావు, జె. సుజాత విధులు నిర్వహిస్తున్నారు.


అయితే అనధికారికంగా సెలవుపై వెళ్లడం, విశ్రాంత ఉద్యోగికి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో స్పందించకపోవడం తదితర కారణాలతో సుజాత‌ను సస్పెన్షన్ చేశారు. అలాగే విధి నిర్వహణలో ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకపోవడంతోపాటు పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు కనిపించక పోవడంతో మిగిలిన వారిని సస్పెన్షన్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


ఈ నలుగురు ఉద్యోగస్థులపై గతంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై మంత్రి విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా ఈ నలుగురిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. విధి నిర్వహణలో అలక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఉద్యోగస్థులను కమిషనర్ వీర పాండ్యన్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని

మద్యం మత్తులో అసెంబ్లీకి సీఎం? పరీక్ష చేయాలంటూ విపక్షాల డిమాండ్

For More AP News And Telugu News

Updated Date - May 01 , 2026 | 06:16 PM