రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ABN , Publish Date - Sep 22 , 2026 | 08:33 PM
సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యం మేరకు రాజధాని నిర్మాణం పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు.
అమరావతి, సెప్టెంబర్ 22: సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యం మేరకు రాజధాని నిర్మాణం పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. మంగళవారం అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు. ముఖ్యంగా సాధారణ పరిపాలన శాఖ (GAD), విభాగాధిపతుల (HOD)కు సంబంధించిన ఐకానిక్ టవర్ల పనులపై ప్రదానంగా చర్చించారు. ఐకానిక్ టవర్ల ముఖ భాగం(facade) నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఈ సందర్భంగా మంత్రి నారాయణ పలు కీలక సూచనలు చేశారు.
అలాగే అమరావతిలో తుది దశలో ఉన్న అధికారుల నివాసాల పురోగతిపైనా కూడా ఆయన చర్చించారు. రాజధాని పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా జరుగుతున్నట్లు మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈ సమీక్షకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ అభిషేక్ కుమార్, ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతామా జగన్?!: మంత్రి లోకేశ్
తిరువూరులో రూ.14 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం
Read Latest AP News And Telugu News