మంగళగిరికి అమరావతి నుంచే తాగునీరు: మంత్రి నారాయణ
ABN , Publish Date - Aug 27 , 2026 | 04:59 PM
మంగళగిరికి రాజధాని అమరావతి నుంచి తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారించిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 65వ సీఆర్డీఏ సమావేశం జరిగింది.
అమరావతి, ఆగస్టు27: మంగళగిరికి రాజధాని అమరావతి నుంచి తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారించిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 65వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న వివిధ పరిపాలన అనుమతులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆ వివరాలను మంత్రి నారాయణ వివరించారు. 06.01.2026 ముందు వరకూ లోన్లు తీసుకున్న రెండో దశ భూసమీకరణ రైతులకు కూడా రుణ మాఫీ వర్తింప చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారని మంత్రి నారాయణ వివరించారు.
రూ.596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్‌కు ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి చెప్పారు. మొత్తం రూ.1,430 కోట్లతో క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు. ఎల్‌పీఎస్ రోడ్లను సీసీకి బదులు బీటీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 29 గ్రామాల లే ఔట్ రోడ్లు బీటీగా మార్చేందుకు అనుమతులు ఇచ్చినట్లు ఆయన వివరించారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌కు కూడా అంగీకారం తెలిపామని అన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఐవోసీఎల్ గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఎఫెక్ట్.. పంచదార్ల కొండల్లో గ్రావెల్ క్వారీ లీజు రద్దు చేసిన ప్రభుత్వం
అమరావతిలో ఆక్టేవ్, వీఐటీ-ఏపీ మధ్య అవగాహన ఒప్పందం
Read Latest AP News And Telugu News