మట్టి గణపతిని పూజిద్దాం! పర్యావరణాన్ని కాపాడుకుందాం
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:13 AM
విఘ్నాలను తొలగించి, శుభాలను ప్రసాదించే పర్వదినం వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం వేర్వేరు ప్రకటనల్లో వారు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం వినాయకచవితి శుభాకాంక్షలు
అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): విఘ్నాలను తొలగించి, శుభాలను ప్రసాదించే పర్వదినం వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం వేర్వేరు ప్రకటనల్లో వారు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో ఉత్సాహం, భక్తిభావం, ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగ వినాయకచవితి అని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. అడ్డంకులను తొలగించి, అందరికీ సుఖసంతోషాలను, ఐశ్యర్యాన్ని విఘ్నేశ్వరుడు ప్రసాదించాలని ప్రార్థించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. మట్టి వినాయక ప్రతిమలను పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిద్దామన్నారు.
కాగా, ప్రకృతిని దైవస్వరూపంగా భావించి, నదులు, వృక్షాలు, పర్వతాలు, జీవరాశులను గౌరవించడం మన సంస్కృతిలో అంతర్భాగమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’