Share News

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:55 PM

కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా వేలాది మందికి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించిందని, అయితే దీనిపై వైసీపీ అధినేత జగన్‌ అనవసర రాద్ధాం తం చేస్తున్నారని, డీఎస్సీపై చర్చకు ఆయన సిద్ధమా అని టీడీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్‌ సవాల్‌ విసిరారు.

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

ఆమదాలవలస, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా వేలాది మందికి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించిందని, అయితే దీనిపై వైసీపీ అధినేత జగన్‌ అనవసర రాద్ధాం తం చేస్తున్నారని, డీఎస్సీపై చర్చకు ఆయన సిద్ధమా అని టీడీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్‌ సవాల్‌ విసిరారు. ఆది వారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఐదేళ్ల విధ్వంస వైసీపీ పాలనలో ఒక డీఎస్సీ నిర్వహించలేని జగన్‌ మంత్రి నారా లోకేశ్‌ నాయకత్వాన్ని చేసి భయపడుతూ అసత్య ప్రచా రాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌ టీడీపీ పట్టణ అధ్యక్షుడు సంపదరావు మురళీ ధరరావు, మాజీ చైర్‌పర్సన్‌ గీత, మురళీధర్‌యాదవ్‌, పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:55 PM