మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:34 PM
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం పోటెత్తింది.
మంత్రాలయం, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం పోటెత్తింది. చైత్రమాసం ఆదివారం శుభదినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భక్తులకు శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వాదించారు.