ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:56 PM
ప్రజా సమస్యలు తెలుసు కొని వాటిని సత్వరం పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ దోహదపడు తుందని, ఈ దిశలో చర్యలు తీసుకుంటున్నట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
రణస్థలం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు తెలుసు కొని వాటిని సత్వరం పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ దోహదపడు తుందని, ఈ దిశలో చర్యలు తీసుకుంటున్నట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత అధికా రులతో మాట్లాడారు. వారం రోజుల్లోగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చౌదరి బాబ్జి, ముప్పిడి సురేష్, బి.వెంకటేశ్వరరావు, బెండు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘ఉన్నతాధికారుల దృష్టికి జీడీఎస్ ఉద్యోగుల సమస్యలు’
గ్రామీణ తపాలా సేవకుల (జీడీఎస్) వేతన, సేవా సంబంధిత సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరి ష్కారానికి కృషి చేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆది వారం తపాలా సేవకుల సంఘ నేతలు ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. 8వ కేంద్ర వేతన సంఘం పర్యవేక్షణలో ప్రత్యేక స్వతంత్ర జ్యుడీషియల్ కమిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.