అన్నమయ్య జిల్లాలో దారుణం.. కాళ్లు, చేతులూ కట్టేసి రైతు దారుణ హత్య
ABN , Publish Date - Sep 20 , 2026 | 09:17 PM
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ రైతు దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..
అన్నమయ్య జిల్లా, సెప్టెంబర్ 20: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ రైతు దారుణ హత్యకు గురయ్యారు.
కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గంగిరెడ్డి గోపాల్ రెడ్డి(40)అనే రైతు అన్నమయ్య జిల్లాలోని కొత్తకోట మండలంలో నాయనబావి గ్రామానికి చెందినవారు. రోజూలాగే.. గోపాల్ రెడ్డి పొలానికి వెళ్లారు. కానీ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో.. కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా.. బోరు వద్ద గోపాల్ రెడ్డి రక్తపుమడుగులో కనిపించారు. దగ్గరికెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు.
సమాచారం అందుకున్న సీఐ గోపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. హత్య జరిగిన విధానాన్ని పరిశీలించారు. ఒంటరిగా బోరు వద్ద ఉన్న గోపాల్ రెడ్డిని ప్రత్యర్థులు కాళ్లు, చేతులు కట్టేసి.. పొదల చాటుకు లాక్కెళ్లారు. అనంతరం ఇనుపరాడ్లు, బండ్లరాళ్లతో దారుణంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోపాల్ రెడ్డికి ఎవరైనా శత్రువులున్నారా..? ఈ మధ్య కాలంలో ఎవరితోనైనా గొడవలు అయ్యాయా.. ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు.. జీజీహెచ్‌లో ఉచిత జన్యు పరీక్షలు
ప్రజల భూమిని లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telugu News