కాకినాడ జిల్లాలో పులి సంచారం
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:00 AM
కాకినాడ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రత్తిపాడు మండలం తాడువాయి–బౌరువాక గ్రామాల మధ్య ఉన్న అడవి ప్రాంతంలో పులి ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
కాకినాడ: జిల్లాలోని అడవి ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రత్తిపాడు మండలం తాడువాయి–బౌరువాక గ్రామాల మధ్య ఉన్న అడవి ప్రాంతంలో పులి ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో ప్రత్తిపాడు, శంఖవరం మండలాల పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శంఖవరము – ప్రత్తిపాడు మండలాల సరిహద్దులో ఉన్న కొండ ప్రాంతాల్లో పులి కదలికలు ఉన్నట్లు గుర్తించారు.
అధికారుల అంచనా ప్రకారం పులి ప్రత్తిపాడు మండలం వైపు వెళ్తే పాండవులపాలెం, గజ్జనపూడి, శరభవరం, ఉత్తర కంచి, ఒమ్మంగి గ్రామాల వ్యవసాయ క్షేత్రాల్లో సంచరించే అవకాశం ఉంది. అదే శంఖవరం మండలం వైపు వెళ్తే మాసంపల్లి, గౌరంపేట, శృంగధార, పెద మల్లాపురం గ్రామాల పరిసర ప్రాంతాల్లో కనిపించే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో రెండు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, గ్రామస్తులు రాత్రి సమయంలో ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని, పశువులను బయట వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పులి కదలికలను గమనించేందుకు అటవీ శాఖ అధికారులు రెవెన్యూ, పోలీస్ శాఖలతో కలిసి సంయుక్తంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
Read Latest Andhra Pradesh News