Share News

గోదావరి కాలుష్యంపై పవన్ స్పందన అభినందనీయం: సోము వీర్రాజు

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:40 PM

గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరు అభినందనీయమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోదావరిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఆంధ్రా పేపర్ మిల్, రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులకు షాకాజ్ నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించారన్నారు.

గోదావరి కాలుష్యంపై పవన్ స్పందన అభినందనీయం: సోము వీర్రాజు
MLC Somu Veerraju

రాజమండ్రి, జూన్ 9: గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరు అభినందనీయమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఆంధ్రా పేపర్ మిల్, రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులకు షాకాజ్ నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించారన్నారు. పేపర్ మిల్ కాలుష్యం కోసం మాట్లాడితే బ్లాక్ మెయిల్ చేస్తారనే వాదన ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. డైనమిక్ లీడర్ పవన్ కల్యాణ్ పేపర్ మిల్ కాలుష్యం నివారణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.


గోదావరి ప్రక్షాళనకు ఏడాదికి రూ.400 కోట్లు చొప్పున కేంద్రం ప్రకటించిందని వెల్లడించారు. రూ.100 కోట్లు నిధులు మంజూరు అయ్యాయన్నారు. గోదావరి పుష్కరాల కోసం 290 గ్రామాలను అభివృద్ధి చెయ్యాలని తెలిపారు. మునికూడలిలో ఘాట్ నిర్మాణం జరుగుతోందన్నారు. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న మోదీ పాలన స్పూర్తిగా ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ప్రధాని మోదీ పేరుతో పూజలు నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం: మంత్రి వాసంశెట్టి సుభాశ్

స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 03:40 PM