అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. మెడికో మృతి
ABN , Publish Date - Aug 14 , 2026 | 10:36 AM
కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
కోనసీమ జిల్లా, ఆగస్టు 14: జిల్లాలోని ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు.. కాకినాడ నుంచి అమలాపురం వెళ్లేందుకు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వాహనంలో బయలుదేరారు. అయితే అనాతవరం వద్ద కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి అల్లం జయసూర్య(30) అక్కడికక్కడే మృతి చెందాడు.
మిగిలిన ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మెడికో మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో జయసూర్య మృతితో తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
విషాదం: విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకు మృతి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
Read Latest AP News And Telugu News