Share News

కాకినాడ సీజన్ 5 రెస్టారెంట్‌లో దారుణం..

ABN , Publish Date - Mar 02 , 2026 | 03:53 PM

కాకినాడలో సీజన్ 5 రెస్టారెంట్ నిర్వాహకుల నిర్వాకం బయటపడింది. కస్టమర్లకు నిల్వ ఉంచిన మాంసాన్ని వడ్డిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.

కాకినాడ సీజన్ 5 రెస్టారెంట్‌లో దారుణం..
Kakinada News

కాకినాడ, మార్చి 2: కాకినాడలో సీజన్ 5 రెస్టారెంట్‌ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సహా రెవెన్యూ, మున్సిపల్, హెల్త్, సివిల్ సప్లైస్ విభాగాల అధికారులు ఈరోజు(సోమవారం) ఆకస్మికంగా దాడులు చేశారు. రెస్టారెంట్‌లో వినియోగదారులకు నిల్వ చేసిన మాంసం వడ్డిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో కిలోలకొద్దీ చికెన్, ఫ్రై శాంపిల్స్‌ను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. నిల్వ మాంసం కావడంతో అన్నింటినీ సీజ్ చేసినట్లు తెలిపారు.


నిల్వ మాంసాన్ని కస్టమర్లకు ఎలా వడ్డిస్తారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రెస్టారెంట్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉండటాన్ని కూడా అధికారులు తప్పుబట్టారు. ఈ చర్యలతో రెస్టారెంట్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ప్రత్తిపాడులో జంతుకొవ్వుతో నూనె తయారు చేస్తూ ఓ ముఠా పట్టుబడిన ఘటన మరువకముందే కాకినాడ రెస్టారెంట్ నిర్వాహకుల మోసం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. కాకినాడలోని అనేక హోటల్స్‌లో తరచూ ఆహార కల్తీ జరుగుతోందనే ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

రాజధాని నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం

కొడాలి నానికి ఆ భయం పట్టుకుంది: వెనిగండ్ల రాము

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 04:13 PM