Share News

ఇసుక ర్యాంపులపై దాడులకు దిగిన మైనింగ్ శాఖ అధికారులు..

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:15 PM

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఇసుక ర్యాంపులపై అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో ఇసుక అక్రమ దందాపై అధికారులు విచారణ చేపట్టారు.

ఇసుక ర్యాంపులపై దాడులకు దిగిన మైనింగ్ శాఖ అధికారులు..
Illegal Sand Mining

అంబేడ్కర్ కోనసీమ జిల్లా: జిల్లాలో ఇసుక అక్రమ దందాపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో ఇసుక అక్రమ దందాపై విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గనుల శాఖ కాకినాడ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరాజు ఆధ్వర్యంలో అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టాయి. కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఇసుక ర్యాంపులపై ఒక్కసారిగా దాడులకు దిగాయి.


కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ, కొత్తపేట మండలం మందపల్లి, రావులపాలెం మండలం గోపాలపురం, ఊబలంక ఇసుక ర్యాంపుల్లో తనిఖీలు చేస్తున్నారు. అలాగే పి.గన్నవరం నియోజకవర్గం ఊడుమూడి ఇసుక ర్యాంపులోనూ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విచారణ అనంతరం ఇసుక అక్రమాలపై నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇసుక అక్రమ దందాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాజధానికి పట్టిన గ్రహణం వీడింది: మంత్రి లోకేశ్


ప్రేమ వివాహం.. నెలరోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్

Updated Date - Apr 02 , 2026 | 04:40 PM