సైబర్ దందా.. దంపతుల నుంచి రూ.85 లక్షలు స్వాహా
ABN , Publish Date - May 29 , 2026 | 07:23 PM
కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వాట్సాప్ ద్వారా నమ్మబలికి ఓ దంపతుల నుంచి సైబర్ కేటుగాడు రూ. 85 లక్షలు మోసం చేసిన ఘటన కలకలం రేపింది.
కాకినాడ జిల్లా: పెద్దాపురంలో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సైబర్ కేటుగాడు ఒక దంపతుల నుంచి రూ. 85 లక్షలు స్వాహా చేసిన ఘటన కలకలం రేపింది.
పెద్దాపురం వర్జుల వారి వీధికి చెందిన సురే వేణు దంపతులను సైబర్ కేటుగాడు లక్షల్లో మోసం చేశాడు. తాను ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ మేనేజర్ అని నమ్మబలికి, 3 నెలల్లో 300 శాతం లాభాలు ఇస్తామని వాట్సాప్ సందేశాలతో వల వేసాడు. ఆ కేటుగాడి మాటలు నమ్మిన వేణు, ఆయన భార్య మహాలక్ష్మి వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. యూజర్ ఐడి 4673 ద్వారా విడతల వారీగా మొత్తం రూ. 85 లక్షలు డిపాజిట్ చేశారు.
తర్వాత డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అకౌంట్ బ్లాక్ అయినట్లు బాధితులు తెలిపారు. అనంతరం నిందితుడు స్పందించకపోవడంతో అనుమానం కలిగిందన్నారు. తాము మోసపోయామని గ్రహించిన సురే వేణు.. పెద్దాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సాధారణ పీఏ ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి..? : పట్టాభి
ఆర్ఎమ్‌యూకి రైళ్ల తయారీ బాధ్యత.. ప్రధానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు..