Share News

రేపటి వైసీపీ ర్యాలీకి నో పర్మిషన్.. కాదని వస్తే అరెస్టులు తప్పవు: విజయవాడ డీఎస్పీ

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:06 PM

విజయవాడ జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రేపు(సోమవారం)జరిగే డీఎస్సీ ర్యాలీకి అనుమతి లేదని.. పోలీసుల సూచనలకు విరుద్ధంగా ఎవరైనా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని విజయవాడ డీఎస్పీ కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు.

రేపటి వైసీపీ ర్యాలీకి నో పర్మిషన్.. కాదని వస్తే అరెస్టులు తప్పవు: విజయవాడ డీఎస్పీ
no permossions given ycp dsc rally at vijayawada

విజయవాడ, సెప్టెంబర్ 20: జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో రేపు(సోమవారం)జరిగే డీఎస్సీ ర్యాలీకి అనుమతి లేదని.. పోలీసుల సూచనలకు విరుద్ధంగా ఎవరైనా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని విజయవాడ డీఎస్పీ కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు.


రేపటి వైసీపీ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదని డీఎస్పీ వెల్లడించారు. ఈ మేరకు విజయవాడలో సెక్షన్ 30(ధర్నాలు, సభలు, ర్యాలీల నిర్వహణకు సంబంధించిన అనుమతులు) అమలులో ఉందని ఆయన తెలిపారు. వీఐపీ జోన్ ఉన్న ప్రాంతంలో ర్యాలీల నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే.. శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. కాగా.. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను కోరుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్‌కు నో పర్మిషన్: రఘురామ

For More AP News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 07:09 PM