Share News

ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ శ్రేణులపై దాడి

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:23 PM

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాజకీయ ఘర్షణ కలకలం రేపింది. నామినేషన్‌ కేంద్రం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్ల దాడి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ శ్రేణులపై దాడి
Dharmavaram Political Clash

శ్రీ సత్యసాయి, అక్టోబర్ 16: జిల్లాలోని ధర్మవరంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్‌ కేంద్రం సమీపంలో టీడీపీ నేతలు.. కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులు టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

నామినేషన్‌ ప్రక్రియకు సంబంధించిన పనుల నిమిత్తం టీడీపీ నేతలు, కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సోదరుడు, ఆయన అనుచరులు సుమారు 20 వాహనాల్లో నామినేషన్‌ కేంద్రం వద్దకు రావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు.


పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందని ఆరోపణలు..

నామినేషన్‌ కేంద్రం వద్ద పోలీసుల సమక్షంలోనే వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడికి దిగినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కేంద్రం వద్ద ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి...

పిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నా: మంత్రి లోకేశ్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 04:30 PM