పేపర్‌మిల్లు నుంచి పెనాల్టీలు ఎలా వసూలు చేయాలో డిప్యూటీ సీఎంకు తెలుసు: ఎంపీ పురందేశ్వరి
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:39 AM
పేపర్‌మిల్లు నుంచి పెనాల్టీలు, పన్నులు ఎలా వసూలో చేయాలో సంబంధిత మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బాగా తెలుసునని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పేపర్‌మిల్లు నుంచి పెనాల్టీలు, పన్నులు ఎలా వసూలో చేయాలో సంబంధిత మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బాగా తెలుసునని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడాలన్నదే బీజేపీ అజెండా అని చెప్పారు. కూటమి పార్టీలకు సీట్ల కేటాయింపులో ఫార్ములా అనేది లేదని, సమన్వయంతో సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయాలనేది బీజేపీ లక్ష్యమని, ఈనెల 17 నుంచి అక్టోబరు 17వ తేదీ వరకూ సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం చేపడతామని ఆమె వెల్లడించారు.
ఈ వార్తలను కూడా చదవండి
వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్