నగరపాలక సంస్థలో విలీనం వద్దు
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:38 PM
శ్రీకాకుళం నగరపాలక సంస్థలో తమ పంచాయతీ విలీనం వద్ద ని, పంచాయతీగానే ఉంచా లని గ్రామ స్థులు కోరారు.
తీర్మానించుకున్న కుశాలపురం గ్రామస్థులు
ఎచ్చెర్ల రూరల్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరపాలక సంస్థలో తమ పంచాయతీ విలీనం వద్ద ని, పంచాయతీగానే ఉంచా లని గ్రామ స్థులు కోరారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలో అన్ని పార్టీల నేతలు, గ్రామ స్థులు సమావేశం నిర్వహించి చర్చిం చారు. కుశాలపురం పంచాయతీగానే ఉంచి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉన్నందున సానుకూలంగా ఫలితం రాకుంటే ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేస్తా మని స్పష్టం చేశారు. న్యాయ పోరాటం చేసి పంచాయతీని సాధించుకుంటామన్నారు. పంచా యతీని కార్పొరేషన్‌లో విలీనం వద్దని, పంచా యతీ ముద్దని నినాదాలు చేశారు. 2019 లో పంచాయతీని కార్పొరేషన్‌లో విలీనం చేశారని, దీంతో 2021 నుంచి ఎన్నికలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీగానే కొనసా గించాలని కోరారు. సమావేశంలో పైడి అన్నం నాయుడు, పైడి గోవిందరావు (టీడీపీ), పైడి త్రిమూర్తులు, పైడి మురళీధర్ (బీజేపీ), పైడి సాంబమూర్తి (బీజేపీ)తో పాటు స్ధానిక పెద్దలు పైడి ఆనందరావు, పైడి అమ్మినాయుడు, వెంక న్నగారి శ్రీను, కిల్లి అప్పారావు, కుశాలపురం పంచాయతీ పరిధిలోని యాతపేట, వెంకటా పురం, అంబేడ్కర్ నగర్, నవ భారత్ నుంచి స్ధానికులు పాల్గొన్నారు.