కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్‌గా దాసరి బాలవర్థన్ రావు
ABN , Publish Date - Sep 22 , 2026 | 03:21 PM
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్‌గా ఎంపికైన మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థన్ రావు నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ, సెప్టెంబర్ 22: కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్‌గా ఎంపికైన మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థన్ రావు నేడు(మంగళవారం) అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం బాలవర్థన్ రావు మాట్లాడుతూ.. 2013లో కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించానని.. నేడు అదే యూనియన్‌కు చైర్మన్‌గా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఆయనపై యూనియన్ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులు నిర్వర్తిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
కృష్ణా మిల్క్ యూనియన్ విశిష్ట స్థానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని బాలవర్థన్ పేర్కొన్నారు. ఈ మేరకు పాలకవర్గ సభ్యులు, ఫీడ్ కమిటీ, ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ.. ఒకే కుటుంబంలా కలిసి చర్చించిన తరువాతే నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పాలకవర్గంతో చర్చించి.. పాల ధరను పెంచామని బాలవర్థన్ అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇతర ఇబ్బందులను తమ దృష్టికి తీసుకురావాలని.. సాధ్యమైనంత వరకు ఆ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్రామీణ రైతాంగం నేడు కష్టాల్లో ఉందని, పశువులకు పచ్చగడ్డి కొరత లాంటి సమస్యలు అనేకం ఉన్నాయని.. వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సిబ్బంది సహకారంతో అందరూ మెచ్చుకునేలా యూనియన్‌ను ముందుకు తీసుకెళ్తామన్నారు.
ఇవి కూడా చదవండి...
‘అసలు డీఎస్సీ అంటే నీకు అర్థం తెలుసా’.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
Read Latest AP News And Telugu News