తునిలో కంటైనర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. 30 మందికి తీవ్రగాయాలు
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:43 PM
కాకినాడ జిల్లాలోని తుని మండలంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
కాకినాడ, సెప్టెంబర్ 17: జిల్లాలోని తుని మండలంలో రాజులకొత్తూరు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ లారీ.. ఓ ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి.
స్థానికుల కథనం ప్రకారం.. తుని మండలంలోని రాజులకొత్తూరు గ్రామం దగ్గర ఓ కంటైనర్ లారీ.. ప్రైవేటు బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు బాధితులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రాథమిక విచారణలో గాయపడిన వారంతా ఉప్పాడవాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు
ఇవి కూడా చదవండి..
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News