కిడ్నాప్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. రూ.1.10 కోట్ల స్వాధీనం
ABN , Publish Date - Sep 14 , 2026 | 08:38 PM
కిడ్నాప్ కేసు దర్యాప్తులో భాగంగా తిరుపతి గ్రామీణ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోమవారం కటారి మోహన్, జ్ఞాన చందును అరెస్ట్ చేశారు.
తిరుపతి, సెప్టెంబర్14: కిడ్నాప్ కేసు దర్యాప్తులో భాగంగా తిరుపతి గ్రామీణ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోమవారం కటారి మోహన్, జ్ఞాన చందును అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు తిరుపతి గ్రామీణ సీఐ మద్దయ్యాచారి వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
నాని క్రికెట్ ప్రిడక్షన్ యాప్‌కు సంబంధించి రూ.6 కోట్ల హవాలా నగదు వ్యవహారంలో బెంగళూరుకు చెందిన కటారి మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అతడి మొబైల్‌లో జరిగిన నగదు లావాదేవీలను పరిశీలించారు. అందుకు అనుగుణంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా నార్త్ ఇండియాకు చెందిన ఓ వ్యక్తి.. రూ. 20 నోటు చూపిస్తే నగదు ఇస్తారంటూ బాలాజీకి చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తద్వారా మూడు విడతలుగా భారీ మొత్తంలో బాలాజీ నగదు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలి విడతలో రూ. 98 లక్షలు, రెండో విడతలో రూ98 లక్షలు, మూడో విడతలో రూ. 30 లక్షలు తీసుకున్నట్లు విచారణలో బహిర్గతమైంది. అందులో రూ.8 లక్షలు బాలాజీ కమిషన్‌గా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన మొత్తంలో సుమారు రూ.2.18 కోట్లను వాజిద్ బాషకు అప్పగించినట్లు దర్యాప్తుల తేలింది.
ఇక హవాలా లావాదేవీలో పరిచయం ఉన్న తిరుపతిలోని తాటితోపునకు చెందిన జ్ఞానచందు కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు కనుక్కున్నారు. అయితే అతడు పీలేరులో ఓ వివాహ కార్యక్రమానికి వచ్చిన సమయంలో హవాలా సొమ్మును తన ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా మళ్లీ అతడు హైదరాబాద్ చేరుకున్నారు. బాలాజీ ఫోన్‌ను పరిశీలించిగా.. నగదు లావాదేవీలపై ఆరా తీయగా జ్ఞానచందు ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించి.. ఆ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ లావాదేవీలు, నగదు మార్పిడితోపాటు నిందితుల మధ్య సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తు పూర్తయ్యే లోపు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తిరుపతి గ్రామీణ సీఐ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పల్నాడు ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
పాదగయ పుష్కరిణిలో యువకుడి మృతి.. స్పందించిన డిప్యూటీ సీఎం
For More AP News And Telugu News