Share News

చేతికొచ్చిన పంటలను నాశనం చేసిన ఏనుగులు.. రైతున్నల ఆవేదన

ABN , Publish Date - May 25 , 2026 | 01:48 PM

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. కూరపర్తివారిపల్లి, నెరబైలు, మడిచెరువు అటవీ సమీపంలోని మామిడి తోటలు, టెంకాయ, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి.

చేతికొచ్చిన పంటలను నాశనం చేసిన ఏనుగులు.. రైతున్నల ఆవేదన
Tirupati Elephants

తిరుపతి జిల్లా, మే 25: యర్రావారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. కూరపర్తివారిపల్లి, నెరబైలు, మడిచెరువు అటవీ సమీపంలోని మామిడి తోటలు, టెంకాయ, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. నేడు, రేపో మామిడి కాయలను మండీలకు తరలించే సమయంలో ఈ విధంగా ఏనుగులు నష్టం కలిగించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


గడిచిన 4 నెలల కాలంలో సుమారు 60% వరకు అన్ని పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు ఇలా పంటలను నాశనం చేస్తూ నష్టం కలిగిస్తూ పోతే తమకు చావే శరణ్యమంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగుల గుంపు నుంచి తమ పొలాలను కాపాడే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఫారెస్ట్ అధికారులను రైతులు కోరారు.


ఇవి కూడా చదవండి...

తిరుపతి వెటర్నరీ వర్సిటీలో చిరుత సంచారంపై డిప్యూటీ సీఎం ఆరా

విజయవాడలో ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్-2026 ప్రారంభం

Read Latest AP News And Telugu News

Updated Date - May 25 , 2026 | 01:52 PM