Share News

రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత..

ABN , Publish Date - Mar 02 , 2026 | 05:20 PM

ఎర్రచందనం స్మగ్లర్ల అక్రమ దందాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన మెరుపు దాడిలో సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత..
Red Sandalwood Smuggling

తిరుపతి, మార్చి2: తిరుపతిలో సోమవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా కర్ణాటక(Karnataka)లోని మారుమూల ప్రాంతంలో కోళ్ల ఫారం మాటున స్మగ్లింగ్ చేస్తున్నాట్లు విచారణలో తేలింది.


స్మగ్లర్లు భారీ ఎత్తున ఎర్రచందనాన్ని తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది. పోలీసుల రాకను గమనించిన స్మగ్లర్లు.. పారిపోయే ప్రయత్నం చేయగా.. వెంబడించి పట్టుకున్నారు. స్మగ్లర్లను పట్టుకున్న బృందాన్ని ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. స్మగ్లింగ్‌కు పాల్పడే వారి‌పై, సహకరించే వారి‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రగ్రహణం.. హోలీ పండగ ఎప్పుడు..?

రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. ఆకాశంలో ‘బ్లడ్‌మూన్’ కనువిందు..

For More AP News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 06:03 PM