Share News

మదనపల్లెలో అరుదైన పక్షి

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:34 AM

మదనపల్లెలో ఓ అరుదైన పక్షి కనిపించింది. హంద్రీ-నీవా కార్యాలయ ప్రాంగణంలోని చెట్టుపైన కనిపించింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పక్షిగా చెబుతున్న ఈ పక్షి.. ఈ ప్రాంతంలో కనిపించడం పట్ల స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మదనపల్లెలో అరుదైన పక్షి

మదనపల్లె(చిత్తూరు): మదనపల్లెలో శుక్రవారం అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. హంద్రీ-నీవా కార్యాలయ ప్రాంగణంలోని చెట్టుపైన కనిపించింది. బెత్తెడు మూతి, బెత్తెడు జుట్టు కలిగి నల్లటిరంగులో, అడుగు పొడవు తోక గల ఈ అరుదైన పక్షి ‘మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పక్షి’గా చెబుతున్నారు. ఇండియన్‌ ప్యారడైజ్‌ ఫ్లై క్యాచర్‌(స్వర్గపు పక్షి)గా పిలిచే భారతదేశపు అడవుల్లో కనిపిస్తుందని చెబుతున్నారు. శరీరం తెలుపురంగులో తల నలుపు, తోక పొడవుగా ఉన్న పక్షి ఇది. చాలా అందంగా కనిపిస్తోంది.


mdp1.2.jpgవివిధ కీటకాలను ఆహారంగా తీసుకునే ఈపక్షి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జాతీయ ఉద్యానవనంలో ఎక్కువగా కనిపిస్తుండగా, స్థానికంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కాలువలు, సరస్సు లాంటి పెద్దచెరువుల వద్ద అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో దివ్య నృత్యకారిణిగా పిలిచే ఈ పక్షి భారతదేశ నైరుతి ప్రాం తానికి చెందినదే అయినా ఇతర ప్రాంతాలకు వలసవెళ్తుంది. ప్యారడైజ్‌ ఫ్లైక్యాచర్‌ శాస్త్రీయ నామం.. టెర్ప్సిఫోన్‌ ప్యారడైజ్‌ అని పిలుస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ధరలు రికార్డు స్థాయిలో డౌన్! నేటి రేట్స్ ఇవీ

భారతి సిమెంట్స్‌కు చెక్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 31 , 2026 | 11:56 AM