అన్ని రంగాల్లో ఏపీ దేశంలోనే ముందుండాలనేది చంద్రబాబు లక్ష్యం: నారా భువనేశ్వరి
ABN , Publish Date - Mar 25 , 2026 | 09:35 PM
అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని నారా భువనేశ్వరి అన్నారు. ఆమె మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
చిత్తూరు జిల్లా, మార్చి 25: అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని నారా భువనేశ్వరి అన్నారు. ఆమె మంగళవారం నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన కోసం సోమవారం రాత్రి కుప్పంలోని తమ నివాసానికి ఆమె చేరుకున్నారు. ఇక తన పర్యటనలో భాగంగా బుధవారం ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
'ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రజల సంతోషాన్ని, ఆనందాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాలించడమే లక్ష్యంగా ఉండాలి. హింసతో కూడిన పరిపాలన ఉండకూడదు. అదే ఒక పార్టీ నాయకత్వానికి ఉండాల్సిన మంచి లక్షణం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్న కుప్పం నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా వాడుతున్నారు. కుప్పంలో సక్సెస్ సాధించిన తర్వాతే దాన్ని రాష్ట్రానికి విస్తరింప చేస్తున్నారు' అని ఆమె తెలిపారు.
'ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రతి కుటుంబంతో మమేకం కావడం కుదరదు కాబట్టి.. చంద్రబాబు కోరిక మేరకు ఆ లోటును నేను భర్తీ చేసేందుకు ప్రతి రెండు మూడు మాసాలకు ఒకసారి కుప్పం పర్యటనకు రావడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి పరచి రాష్ట్రానికి ఒక ఆదర్శవంతంగా తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యం. సీఎం తపనంతా ఏపీ అన్ని రంగాల్లో దేశంలోనే ముందుండాలన్నది లక్ష్యం. ఆదిశగా ఆయన కూటమి పార్టీలతో కలిసి శ్రమిస్తున్నారు. నాడు 2020, నేడు 2047 విజన్‌తో సీఎం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు' అని నారా భువనేశ్వరి అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్వల్ప అస్వస్థత
అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం..