28న అసెంబ్లీ సమావేశం.. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం..
ABN , Publish Date - Mar 25 , 2026 | 08:32 PM
ఈ నెల 28వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు.
అమరావతి, మార్చి 25: ఈ నెల 28వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. 28వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయనుంది. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్నది పార్లమెంట్ రికార్డుల్లో స్పష్టంగా ఉండేలా కేంద్రం ద్వారా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
అమరావతికి రూ. 15 వేల కోట్ల సాయం ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుంచి రూ.15 వేలకోట్లు, హడ్కో ద్వారా మరో రూ.11 వేలకోట్లు సమకూరుస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతితో అసెంబ్లీ, హైకోర్టు, ఐదు టవర్ల ఐకానిక్ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో ఉంటుందని, ప్రజలు పైకి వెళ్లి నగరం మొత్తాన్ని చూడవచ్చని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కుమార్తె.. జవహర్ నగర్ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు
ధురంధర్ 2 మూవీపై పాక్ మాజీ క్రికెటర్ రియాక్షన్ ఇదే!