ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కుమార్తె.. జవహర్ నగర్ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు
ABN , Publish Date - Mar 25 , 2026 | 08:01 PM
జవహర్ నగర్‌లో సంచలనం సృష్టించిన అంజు హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో తల్లి హత్యకు చిన్న కుమార్తె, ఆమె ప్రియుడు కారణమని పోలీసులు వెల్లడించారు.
మల్కాజ్‌గిరి: జవహర్ నగర్‌లో జరిగిన అంజు హత్య కేసుకు సంబంధించి డీసీపీ శ్రీధర్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. నాలుగు నెలల పాటు ఎలాంటి క్లూ దొరకని ఈ కేసులో చివరికి సంచలన నిజాలు బయటపట్టారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం, అంజు చిన్న కుమార్తె.. తన ప్రియుడు మాంటి రాజ్‌తో కలిసి ఈ హత్యకు పాల్పడింది. ప్రేమ వివాహానికి తల్లి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్న ఇద్దరూ హత్యకు ప్లాన్ వేశారు. జాబ్ నుంచి ఇంటికి వచ్చిన అంజును ఇంట్లోనే బంధించి, కత్తితో దాడి చేశాడు మాంటి రాజ్. అనంతరం ఇద్దరూ కలిసి గొంతు కోసి అంజును హత్య చేశారు. హత్య అనంతరం అదే ఇంట్లో బెడ్‌రూమ్‌లో బెడ్ కింద మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. పెద్ద కూతురికి అనుమానం రాకుండా గది మొత్తం స్ప్రేలు చల్లి దాచిపెట్టారు.
ఇక, ఈ ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మాంటి రాజ్‌పై ఇప్పటికే రెండు పోక్సో కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. గతంలో అంజు తన చిన్న కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆ కేసులో అతను 50 రోజులు జైలు శిక్ష కూడా అనుభవించాడు.
ఇదిలా ఉంటే, తల్లిని హత్య చేసిన అనంతరం, అమ్మ చిట్టీ డబ్బుల కోసం ఇద్దరూ కలిసి చిట్టీ వేసే వ్యక్తిని అడిగారు.. అయితే, చిట్టీ నిర్వాహకుడు పోలీస్ FIR ఉంటేనే చిట్టీ డబ్బులు ఇస్తామని చెప్పాడు. దీంతో ఆ డబ్బుల కోసం పోలీసులకు పిర్యాదు చేశారు. అప్పటికే చిన్న కూతురు తల్లి వేరే వ్యక్తితో వెళ్ళిపోయింది అని నమ్మించిందని తెలిసింది. అంజును మే 12న హత్య చేసినట్లు విచారణలో తేలింది. అక్టోబర్‌లో పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.
అంజుకు చెందిన జూపిటర్ స్కూటీని చిన్న కూతురు, ఆమె ప్రియుడు కలిసి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్కూటీని త్వరలో స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం నిందితుడు మాంటి కుమార్ సింగ్ అలియాస్ మాంటి రాజ్‌ను రిమాండ్‌కు తరలించగా, చిన్న కూతురు మైనర్ కావడంతో ఆమెను జువైనల్ హోమ్‌కు పంపించారు. పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.
Also Read:
ఆ ఇళ్లను కొత్త వారికి ఇస్తాం: మంత్రి పొంగులేటి
తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ.. ఎవరేమన్నారంటే..
For More Latest News