Share News

ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు: చెవిరెడ్డి భార్య, కుమారుడి విచారణ

ABN , Publish Date - May 26 , 2026 | 05:15 PM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.ఈ స్కాంలో అక్రమ నగదు చలామణి, హవాలా మార్గాల ద్వారా భారీగా నిధులు చేతులు మారాయనే ఆరోపణలపై ఈడీ దృష్టి సారించింది.

ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు: చెవిరెడ్డి భార్య, కుమారుడి విచారణ
AP liquor scam

అమరావతి, మే 26: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం (లిక్కర్ స్కాం) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన విచారణను తీవ్రతరం చేసింది. ఈ స్కాంలో అక్రమ నగదు చలామణి (మనీలాండరింగ్), హవాలా మార్గాల ద్వారా భారీగా నిధులు చేతులు మారాయనే ఆరోపణలపై ఈడీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబానికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ఆధారంగా చెవిరెడ్డి భార్య, ఆయన కుమారుడు తాజాగా ఈడీ విచారణకు హాజరయ్యారు.


మద్యం వ్యాపారాలు, లైసెన్సుల కేటాయింపుల వ్యవహారంలో చెవిరెడ్డి భార్య పేరిట భారీ ఎత్తున అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. హవాలా మార్గాల ద్వారా కోట్ల రూపాయల మేర చేతులు మారినట్లు వస్తున్న ఆధారాలపై అధికారులు వీరిని విచారించారని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో చెవిరెడ్డి భార్యతో పాటు ఆయన కుమారుడి పాత్రపై కూడా ఈడీ కీలక ఆధారాలు సేకరించిందని సమాచారం. ఈ కేసులో మరికొందరు రాజకీయ ప్రముఖులు, అధికారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో, తాజా ఈడీ విచారణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ

Updated Date - May 26 , 2026 | 05:31 PM