Share News

Parvati Mandapam: తిరుమలలో ఏనుగుల హల్‌చల్.. అప్రమత్తమైన అటవీ సిబ్బంది

ABN , Publish Date - Jan 19 , 2026 | 08:22 AM

తిరుమల పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపులు హల్‌చల్ చేశాయి. గత అర్ధరాత్రి తిరుమల అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చాయి. ఆ విషయాన్ని విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యారు.

Parvati Mandapam: తిరుమలలో ఏనుగుల హల్‌చల్.. అప్రమత్తమైన అటవీ సిబ్బంది
Elephnats At Parvati Mandapam In tirumala

తిరుమల, జనవరి 19: పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు మరోసారి హల్‌చల్ చేశాయి. ఆదివారం అర్ధరాత్రి తిరుమల అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చింది. ఆ విషయాన్ని విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. ఆ వెంటనే వారు రంగంలోకి దిగారు. ఏనుగుల గుంపులను అటవీ ప్రాంతంలోకి తిరిగి వెళ్లేలా వారు చర్యలు చేపట్టారు.


అయితే ఈ సమయంలో పాపవినాశనంకు భక్తుల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. గతంలో సైతం పార్వేటి మండపం, ఏడో మైలురాయి వద్ద ఏనుగులు గుంపులు గుంపులుగా రహదారిపైకి ఒక్కసారిగా వచ్చేవి. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ని సైతం ధ్వంసం చేసిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి.


దాంతో ఏనుగులు అడవి నుంచి బయటకు రాకుండా అటవీ శాఖ సిబ్బంది పటిష్టమైన చర్యలు చేపట్టారు. దాంతో ఏనుగుల గుంపులు రహదారిపైకి వచ్చే ఘటనలు చాలా వరకు తగ్గాయి. కానీ మళ్లీ ఏనుగుల గుంపు రహదారిపైకి వస్తుండడంతో.. శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో ఇలా రహదారులపైకి ఏనుగులు రాకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీటీడీ, అటవీశాఖ ఉన్నతాధికారులను శ్రీవారి భక్తులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మేడారంలో సీఎం రేవంత్ గద్దెల ప్రారంభోత్సవం

అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..

For more AP News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 09:45 AM