మేడారం గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్..

ABN, Publish Date - Jan 19 , 2026 | 07:46 AM

ఆధునికీకరించిన మేడారం గద్దెల ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ దేవతలను ఆయన దర్శించుకున్నారు. అమ్మవార్లకు తొలి మొక్కులు చెల్లించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ములుగు: ఆధునికీకరించిన మేడారం గద్దెల ప్రాంగణాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మ దేవతలను ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. అమ్మవారికి తొలి మొక్కులు చెల్లించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. అలాగే వనదేవతలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు దర్శించుకున్నారు. అంతకుముందు గద్దెల పునరుద్ధరణ పైలాన్‌ను వారు ఆవిష్కరించారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

సీఎం రేవంత్ రెడ్డి మనవడికి ఇప్పపువ్వు లడ్డూ ఇచ్చిన మంత్రి సీతక్క

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ కు సీఎం రేవంత్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 19 , 2026 | 08:02 AM