Share News

CM Chandrababu Family: భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ

ABN , Publish Date - Jan 14 , 2026 | 05:43 PM

భోగి పండగ వేళ.. సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినీ, శ్రీభరత్ దంపతుల చిన్నారులు ఎద్దుల బండిలో ఊరేగారు.

CM Chandrababu Family: భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ
Bhogi Festival Celebrations

కుప్పం, జనవరి 14: సంస్కృతి, సంప్రదాయలు చాటి చెప్పేలా నారావారిపల్లిలో భోగి పండగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా పాల్గొంటున్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు భార్య భువనేశ్వరితో సహా కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. ఇక బుధవారం భోగి పండగ వేళ.. సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినీ, శ్రీభరత్ దంపతుల పిల్లలు ఎద్దుల బండిలో ఊరేగారు.

Chandrababu5.jpg


ఈ సందర్భంగా ఎద్దుల బండిని బెలూన్లతో అందంగా అలంకరించారు. ఈ ఎద్దుల బండిపై వారు వారంతా అటుఇటు తిరిగారు. దేవాన్ష్‌తోపాటు శ్రీభరత్ దంపతుల చిన్నారులు సైతం ఈ సందర్భంగా గ్రామంలోని పిల్లలందరికీ చేతులు ఊపుతూ ఎద్దుల బండిలో తిరిగారు. అనంతరం ఈ ఎడ్ల బండి దిగి.. స్థానికంగా ఉన్న చిన్నపిల్లకు వీరు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పిల్లల్లో ఆనందం వెల్లువిరిసింది.

Chandrababu4.jpg


తన స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రి నారా లోకేశ్ స్వగ్రామానికి చేరుకున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు వీరు స్వగ్రామంలోనే ఉండి.. సంక్రాంతి సంబరాలు జరుపుకోనున్నారు. మంగళవారం ఉదయం స్వగ్రామంలో ఏర్పాటు చేసిన.. ముగ్గుల పోటీలను సీఎం సతీమణి నారా భువనేశ్వరితోపాటు నారా బ్రాహ్మణి పరిశీలించారు.

Chandrababu6.jpg


అలాగే చిన్నారులకు ఆటల పోటీలు.. మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భారీగా బాలురు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. అలాగే గ్రామస్తుల నుంచి అర్జీలను సీఎంతోపాటు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ స్వీకరించారు.

Chandrababu1.jpg


సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారికి తండ్రితనయులు భరోసా ఇచ్చారు. ఇక మంగళవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. నాలుగు రోజులపాటు ఈ సంబరాల్లో పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.


Chandrababu2.jpg

Chandrababu3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి.. స్వదేశానికి రాని ఎన్నారైలు

పండగ వేళ గుడ్ న్యూస్.. ఖాతాలు చెక్ చేసుకోండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 14 , 2026 | 06:22 PM