Share News

Government Employees: పండగ వేళ గుడ్ న్యూస్.. ఖాతాలు చెక్ చేసుకోండి..

ABN , Publish Date - Jan 14 , 2026 | 03:02 PM

సంక్రాంతి పండగ వేళ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బకాయిలు పండగ వేళ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో నగదు నేడు జమ చేసింది.

Government Employees: పండగ వేళ గుడ్ న్యూస్.. ఖాతాలు చెక్ చేసుకోండి..

అమరావతి, జనవరి14: సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం ఇవాళ (బుధవారం) చెల్లించింది. దీంతో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమవుతోంది. దాంతో ఆయా ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. అలాంటి వేళ ఏపీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పందించారు. పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, డీఏ ఎరియర్లను ప్రభుత్వం విడుదల చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి సంక్రాంతి పండుగను తామందరం చాలా సంతోషంగా జరుపుకుంటామని చెప్పారు.


గతంలో సీఎం చంద్రబాబును కలిసి సరెండర్ లీవులకు సంబంధించిన నగదు విడుదల చేయాలని కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. తమకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు పోలీసులు అందరి తరఫున కృతజ్ఞతలతోపాటు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు. అలాగే ఈ నిధులు విడుదలకు సహకరించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, హోమ్ మంత్రి అనితతోపాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఈ సందర్భంగా శ్రీనివాసరావు కృతజ్ఞతలు చెప్పారు.


సంక్రాంతి పండగవేళ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు డీఏ, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవులతోపాటు కాంట్రాక్టర్లకు పెండింగులో ఉన్న బిల్లులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో భోగి పండుగ రోజు ఈ నగదు బకాయిలు చెల్లించింది. నగదు ఖాతాల్లో జమ కావడంతో వారంతా ఆనందంలో ఉన్నారు.


డీఏ, డీఆర్ఏ ఎరియర్స్ నిమిత్తం ఒక్కో ఉద్యోగి, పోలీసుల ఖాతాల్లో రూ.70 నుంచి రూ.80 వేల వరకు నగదు జమ అవుతుంది. పండగ పూట డీఏ, డీఆర్ఏ బకాయిలు జమ కావడంతో ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. సుమారు 5.70 లక్షల మంది ఖాతాల్లో ఈ నిధులను ఆర్థిక శాఖ జమ చేస్తోంది. ప్రభుత్వానికి, సీఎంకు ఉద్యోగ సంఘాలు సైతం కృతజ్ఞతలు తెలియజేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్ట్ సరికాదు: జగ్గారెడ్డి

మహబూబ్‌నగర్‌లో మంత్రుల పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 14 , 2026 | 03:57 PM