Tirumala Parakamani: పరకామణిలో సంస్కరణలపై నివేదిక.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 06:20 PM
తిరుమల పరకామణిలో వెంటనే చేపట్టనున్న సంస్కరణలకు సంబంధించిన నివేదికను ఏపీ హైకోర్టుకు టీటీడీ సమర్పించింది. ఈ నివేదిక పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును మంగళవారానికి వాయిదా వేసింది.
అమరావతి, జనవరి 05: తిరుమల శ్రీవారి పరకామణిలో వెంటనే చేపట్టనున్న సంస్కరణల నివేదికను పరిశీలించిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పరకామణిలో వెంటనే చేపట్టాల్సిన సంస్కరణలపై ఏపీ హైకోర్టుకు టీటీడీ సోమవారం నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు పై విధంగా స్పందించింది.
ఇక ఈ పరకామణి వ్యవహారంలో కేసుల నమోదు విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించి రావాలని సీఐడీ, ఏసీబీ డీజీలను హైకోర్టు ఆదేశించింది. శ్రీవారి పరకామణిలో హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టనున్న సంస్కరణలపై హైకోర్టుకు టీటీడీ నివేదిక అందజేసింది. ఈ కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో నగదు చోరీ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయినాయి. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాంటి వేళ.. ఈ కేసులో కీలకమైన టీటీడీ మాజీ ఎస్‌వీఓ అధికారి.. విచారణకు వస్తూ అనుమానాస్పద రీతిలో మరణించాడు.
ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పరకామణిలో సంస్కరణలు తీసుకు రావడం కోసం టీటీడీ పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. దీనిపై హైకోర్టు పైవిధంగా స్పందించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కవిత ఆరోపణలు.. చర్యలు తీసుకోని సీఎం: టీ బీజేపీ చీఫ్
పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అవకాశాలు: నాగబాబు
For More AP News And Telugu News