Share News

ఏపీ ప్రయోజనాలపై కేంద్రంతో కీలక చర్చలు.. మహాబలిపురానికి సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 19 , 2026 | 09:20 PM

తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20వ తేదీ) దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) 31వ సమావేశం జరగనుంది.

ఏపీ ప్రయోజనాలపై కేంద్రంతో కీలక చర్చలు.. మహాబలిపురానికి సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

చెన్నై, ఆగస్టు 19: తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20వ తేదీ) దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) 31వ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించనున్నారు. ఆ క్రమంలో ఏపీ పునర్విభజన చట్టం అమలుపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.


విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరనున్నారు. షెడ్యూల్ 9,10 సంస్థల విభజనపై కేంద్రం దృష్టికి ఆయన తీసుకెళ్లనున్నారు. ఆస్తులు, అప్పుల పంపకం, పెండింగ్‌లోని ఆర్థిక అంశాల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే రెవెన్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలను కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. దుగరాజుపట్నం పోర్టు అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.


విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని ఆయన కోరనున్నారు. రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి కేంద్ర సహకారం ఆయన కోరనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అంశాన్ని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు.


ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అందిస్తున్న సహకారానికిగాను కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. మిగిలిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతోపాటు నిధులు సమకూర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు.


ఇవి కూడా చదవండి..

గాలింపు చర్యల వివరాలు ఎప్పటికప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు తెలపండి: సీఎం చంద్రబాబు

అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదు: సీఈవో

For More AP News And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 09:30 PM