కళాకారులకు ప్రత్యేక పింఛన్లు: మంత్రి దుర్గేశ్
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:53 AM
కళాకారులకు డేటా బ్యాంకు ఏర్పాటు చేసి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. కళాకారుల సేవలను గౌరవించేలా ప్రత్యేక విధానంలో పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రత్యేక పింఛన్లు కూడా..: మంత్రి దుర్గేశ్
రాజమహేంద్రవరం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): కళాకారులకు డేటా బ్యాంకు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను అందజేస్తామని.. సాధారణ పింఛన్లతో కాకుండా కళాకారుల సేవలను గౌరవించేలా ప్రత్యేక విధానంలో పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం నాట్యార్పణ పేరిట నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనకు మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కూచిపూడి నృత్య కళాభివృద్ధికి, సంప్రదాయ కళల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వి హంచే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో మొదటిగా కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో మన కళలకు మరింత వైభవం తీసుకొస్తామన్నారు. 12 రోజులపాటు జరిగే ఈ మహాత్సవాల్లో కూచిపూడి ప్రదర్శనలకు ప్రత్యేక అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి: