మార్చికి 5.52 లక్షల ఇళ్లు పూర్తి
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:19 AM
వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 5.52 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2029 నాటికి అర్హులైన ప్రతి కుటుంబానికి శాశ్వత ఇల్లు అందించే ‘హౌసింగ్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేయాలని సూచించారు.
సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి: సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 5.52 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్, పీఎం జన్‌మన్ సహా వివిధ పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే నెలలోగా గ్రౌండింగ్ చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ 1.5 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి 2.05 లక్షల ఇళ్లు, 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. గృహనిర్మాణ శాఖపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘హౌసింగ్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. 2027 డిసెంబరు నాటికి 75 వేల కొత్త గృహాలు మంజూరయ్యేలా చూడటంతోపాటు 1.5లక్షల ఇళ్లను పైప్‌లైన్‌లోకి తీసుకురావాలని సూచించారు. ఆర్టీజీఎస్ సహా ఆవాస్ ప్లస్, హౌసింగ్, రెవెన్యూ శాఖల నుంచి డేటాను అనుసంధానం చేసుకుని, డూప్లికేషన్ లేకుండా అర్హులను గుర్తించాలని దిశానిర్దేశం చేశారు. కుప్పం నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో గృహ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర సహకారంతో వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక టౌన్‌షి్‌పలను నిర్మించే అంశంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. శ్రీసిటీ సహా వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్‌షి్‌పల ఏర్పాటు ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని వీటి నిర్మాణాన్ని చేపట్టాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యాన హబ్‌కు ప్రపంచబ్యాంకు ఓకే!
మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News