ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరిస్తాం.. ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో మంత్రి నారాయణ
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:05 PM
ఏపీ మంత్రి పి. నారాయణ నెల్లూరులోని కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు కళాశాల విద్యార్థులతో రెండు గంటల పాటు ముఖాముఖి నిర్వహించారు.
నెల్లూరు, సెప్టెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ జిల్లాలోని కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు కళాశాల విద్యార్థులతో రెండు గంటల పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని సాధ్యమైనంత వరకూ అక్కడికక్కడే పరిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం పాతకాలం నాటిదని, దీనిని పునరుద్ధరించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తామని, విద్యార్థులు ఆడుకోవటానికి నెల రోజుల్లో స్పోర్ట్స్ కోర్టులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. తరగతి గదులు, టాయిలెట్స్‌ను ఆధునికీకరిస్తామని ఆయన మాట ఇచ్చారు.
కేఏసీ కళాశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. వారికి నారాయణ విద్యాసంస్థల ద్వారా ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.15 రోజుల్లో 40 కంప్యూటర్లను విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. దీంతో పాటూ 14 డిజటల్ బోర్డులు, డైనింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. స్నేహితులు, సన్నిహితుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరిస్తున్నామని.. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23 స్కూళ్లను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తీర్చుదిద్దుతామని మంత్రి అన్నారు.
ఇవీ చదవండి:
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ ఎదుట ఏ4 సురేశ్ లొంగుబాటు
ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ
For More AP News And Telugu News